ప్రజల ప్రాణాలంటే కేసీఆర్, కేటీఆర్‌కు పుల్లతో సమానం: రేవంత్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
ప్రజల ప్రాణాలంటే కేసీఆర్, కేటీఆర్‌కు పుల్లతో సమానం: రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే పూచిక పుల్లతో సమానమని అన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. వర్షం, వరదలపై ముందస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తెలంగాణ వరదలతో అతలాకుతలం అయ్యిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ ఫిరాంయిపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని మండిపడ్డారు. ఓ పక్క రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తోన్న వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా కేవలం రాజకీయాలపైనే దృష్టి పెట్టారని నిప్పులు చెరిగారు.

రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే మంత్రి కేటీఆర్ మాత్రం పార్టీల్లో మునిగిపోయారని ఆరోపించారు. వరద సహయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో 30 మంది చనిపోయిన సీఎం కేసీఆర్ పరామర్శించలేదని ధ్వజమెత్తారు. వరద బాధితులను పరామర్శించడానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం తాత్కలిక వరద సాయం కింద రాష్ట్రానికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై ఉందన్నారు.

Also Read... సహాయక చర్యలు ముమ్మరం చేయండి.. ఎలాంటి సహాయానికైనా సర్కార్ సిద్ధం: KTR

Next Story

Most Viewed