ప్రభుత్వ భూమిలో BRS MP పాగా.. భూ దోపిడీలను సీరియల్‌గా ప్రకటిస్తా: రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
ప్రభుత్వ భూమిలో BRS MP పాగా.. భూ దోపిడీలను సీరియల్‌గా ప్రకటిస్తా: రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ భూమిలో రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి పాగా వేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైటెక్ సిటీలో సీఎం కేసీఆర్​భూ దోపిడీకి పాల్పడ్డట్లు తెలిపారు. హైటెక్​సిటీ పరిధిలో ఏడాదికి రూ.50 కోట్లు అద్దెకు వచ్చే భూములను పార్థసారథికి కేవలం రూ.లక్షన్నరకే ఇచ్చారని అన్నారు. హెటిరోకి 60 ఏళ్ల పాటు అతి తక్కువకే భూములను లీజుకు ఇవ్వడం ఏంటని? ప్రశ్నించారు. 10 ఎకరాలు మాత్రమే ఇవ్వాలని రూల్​ఉన్నప్పటికీ, సీఎం పార్థసారథికి 15 ఎకరాలు ఇచ్చారన్నారు. హెటిరోకు ఇచ్చిన భూమికి ప్రతి సంవత్సరం రూ.50 కోట్ల 50 లక్షలు వసూల్ చేయాలన్నారు.

కానీ ప్రభుత్వం కేవలం లక్షా 47 వేల 743 లను మాత్రమే తీసుకుంటున్నదన్నారు. ప్రతి ఐదేళ్లకు రెంట్​పెంచుకుంటూ పోతే ఏకంగా అరవై ఏళ్లకు రూ.5346 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంటుందన్నారు. కానీ సీఎం చొరవతో 60 ఏళ్లకు 15 ఎకరాల భూమిని కేవలం రూ.కోటి 47 లక్షలకే లీజుకు ఇచ్చారన్నారు. ఇది దారుణమని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఇప్పటికిప్పుడు అమ్మిన ఆ పదిహేను ఎకరాలకు కనీసం రూ.1500 కోట్లు వస్తాయన్నారు. ఈ భూ దోపిడీలో అధికారుల పాత్ర కూడా ఉన్నదని రేవంత్ పేర్కొన్నారు. ఎంఆర్వో, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్‌తో పాటు గ్రేటర్​హైదరాబాద్ ముగ్గురు కలెక్టర్లకూ బాధ్యత ఉంటుందన్నారు. ముఖ్యంగా సోమేష్​కుమార్, అరవింద్ కుమార్, జయేష్​రంజన్, వెంకట నర్సింహారెడ్డి తదితరులు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్​అధికారంలోకి వస్తుందని అందరి సంగతీ తెలుస్తామని హెచ్చరించారు.

యశోద సంగతీ తెల్చుతాం..?

యశోద ఆసుపత్రికి కూడా కేసీఆర్​అక్రమంగా భూములు ఇచ్చాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో పాటు మరి కొన్ని సంస్థలకు 60 ఎకరాలను ఉదారంగా ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని స్పష్టం చేశారు. ఇవన్నీ డైలీ సీరియల్​విధానంలో ప్రకటిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణకు జూబ్లీ హిల్స్‌లో భూములు ఎలా వచ్చాయి? వంటి వాటిని కూడా తెర మీదకు తెస్తామన్నారు. కేసీఆర్​ఇక నుంచి రెడీగా ఉండు అంటూ రేవంత్ సవాల్ విసిరారు.

వందమంది దావుద్‌లు కలిస్తే ఒక కేసీఆర్..

వందమంది దావుద్ ఇబ్రహీంలు కలిస్తే ఒక కేసీఆర్​అని రేవంత్ విమర్శించారు. సీఎం వ్యవహార శైలీ, ఆలోచనలన్నీ అవేనని చెప్పారు. భూ దోపిడీలు చేసి సంపాదించిన లక్ష కోట్లతో దేశ రాజకీయాలను కలుషితం చేసేందుకు సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడని వివరించారు. బీజేపీ కార్పొరేట్‌లను ప్రోత్సహిస్తే, కేసీఆర్ మాఫియాలకు మద్దతు పలుకుతున్నాడన్నారు. భూములు, జాతీ సంపదను కొట్టకొట్టి జాతీయ రాజకీయాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. భూ దోపిడీలపై సీబీఐ, ఈడీతో పాటు తదితర దర్యాప్తు సంస్థలకు తానే స్వయంగా లేఖలు రాయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు కేసీఆర్​మోసాలపై దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకూ లేఖ రాస్తానని వెల్లడించారు.

Also Read..

YS Avinash Reddy: ఆ వీడియోలు, ఆడియోలు ఇవ్వండి..!



Next Story

Most Viewed