నూతన సెక్రటేరియట్‌కు ‘‘రిపేర్’’ వర్క్స్.. ప్రారంభించిన మూడు రోజుల్లోనే సర్కార్‌పై విమర్శల వెల్లువ!

by Disha Web Desk 19 |
నూతన సెక్రటేరియట్‌కు ‘‘రిపేర్’’ వర్క్స్.. ప్రారంభించిన మూడు రోజుల్లోనే   సర్కార్‌పై విమర్శల వెల్లువ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా కట్టిన సచివాలయంలోని మీడియా సెంటర్‌కు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. నిర్మాణపు పనుల్లో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు. సచివాలయం ప్రారంభోత్సవం జరిగిన రాత్రి కురిసిన వర్షానికి మీడియా సెంటర్‌లో వాటర్ లీక్ అయిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించినా.. ఒక్క రోజు వర్షానికే శ్లాబ్‌కు ఉన్న బీమ్‌ల ద్వారా వాటర్ లీకైంది. ఫ్లోరింగ్ మొత్తం నీటితో నిండిపోవడంతో పాత్రికేయులు అక్కడ ఉండలేని పరిస్థితి చోటుచేసుకున్నది. ఈ విషయం రోడ్లు భవనాల శాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది.

అకాల వర్షాలకే ఇలా జరిగితే ఇక తుఫానులు, వర్షాకాలంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందోననే విమర్శలు వెల్లువెత్తాయి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంజనీర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో రిపేర్ వర్క్స్ మంగళవారం మొదయ్యాయి. బీమ్‌లలో నాణ్యత లేకపోవడం, శ్లాబ్ మూలల నుంచి నీరు కారడం, బైటవైపు గోడలకు పగుళ్ళు రావడం.. వీటన్నింటికీ మరమ్మత్తులు జరుగుతున్నాయి. జరిగిన తప్పును చక్కదిద్దడంపై అధికారులు ఫోకస్ పెట్టారు.

Read more:

బ్రేకింగ్: కల్లు గీత కార్మికులకు శుభవార్త.. CM కేసీఆర్ కీలక నిర్ణయం

Next Story

Most Viewed