HYD: ప్రజాభవన్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు బీభత్సం

by GSrikanth |
HYD: ప్రజాభవన్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ బీభత్సం సృష్టించాడు. మంగళవారం ఉదయం కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ ప్రజా భవన్ వద్ద స్వల్ప ప్రమాదానికి కారణమయ్యాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. కేసు తప్పుదోవ పట్టించడానికి వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోహేల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా, గతంలోనూ షకీల్ కుమారుడు కారుతో ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమయ్యాడు.

Next Story

Most Viewed