- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
తెలంగాణలో రెండు'ఎల్' నడుస్తున్నాయి : అశోక్ సింగ్ చవాన్

దిశ, రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రంలో రెండు 'ఎల్' నడుస్తున్నాయని మహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడు అశోక్ సింగ్ చవాన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ల్యాండు, లిక్కర్ (రెండు ఎల్స్) అమ్మకాల ద్వారా సర్కార్ నడుస్తుందని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ లో మరాఠాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటించారు. ఆదివారం రాహుల్, సోనియా గాంధీ విజయభేరి విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు ఇచ్చిన ఆరు హామీలపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడారు.
బీఆర్ఎస్, ఎంఐఎం బీజెపీకి సహకరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఇండియా కూటమి అంటే ఎందుకు భయమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎంతో గొప్ప క్రికెటర్లైన వీవీఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.