ఒరిగిన విద్యుత్‌ స్తంభం..పొంచిఉన్న ప్రమాదం..!

by Kalyani |
ఒరిగిన విద్యుత్‌ స్తంభం..పొంచిఉన్న ప్రమాదం..!
X

దిశ, తాండూరు : ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఎప్పుడు ఏ విద్యుత్‌ స్తంభం పడి ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాండూరు మండలం కరన్ కోట్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న విద్యుత్ స్తంభం పూర్తిగా ఒరిగిపోయి పడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇది జీవన్గి,కరన్ కోట్ ప్రధాన రహదారి మధ్యన ఉంది. సాగర్ రోడ్డు దాటిన తర్వాత స్తంభం కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సమస్య మరింత ప్రమాదకరంగా ఉంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు దీనిపై దృష్టిసాధించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.Next Story

Most Viewed