అందరికీ ఆదర్శం శ్రీనివాస్ : Minister Sabitha Indra Reddy

by Disha Web Desk 7 |
అందరికీ ఆదర్శం శ్రీనివాస్ : Minister Sabitha Indra Reddy
X

దిశ, చౌదరిగూడ : చౌదరిగూడ మండలంలోని జిల్లేడు గ్రామంలో పొట్టి సత్తయ్య జ్ఞాపకార్ధంగా నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉన్న ఊరు చదువుకున్న బడిని మరవద్దు అనే ఉద్యేశంతో అమెరికా నుండి వచ్చి తన తండ్రి జ్ఞాపకార్ధంగా పాఠశాల నూతన భవనం, మౌలిక సదుపాయాలు కల్పించిన పొట్టి శ్రీనివాస్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ ప్రవేశపెట్టి, 1150 జూనియర్ కాలేజీలు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి అక్కడే చదువుకునే విధంగా చేశారని అన్నారు.

గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థికి లక్ష యాబై వేల రూపాయలతో మంచి విద్యను అందిస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి వారికి విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి రూ. 20 లక్షలు ఇచ్చి వారి భవిష్యత్‌కు కేసీఆర్ బాటలు వేస్తున్నారన్నారు. కట్టించిన పాఠశాలలో ఒక్కరు బాగుపడిన శ్రీనివాస్‌లా స్కూల్‌ను కట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ యాదమ్మ, జడ్పీటీసీ స్వరూప, ఆర్డీఓ రాజేశ్వరి, సర్పంచ్ బాబురావు, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ మహేష్ బాబు, ఎంఈఓ కృష్ణారెడ్డి, దాత శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హఫీజ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



Next Story