దైవ దర్శనం చేసుకుని వస్తుండగా.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ..

by Disha Web |
దైవ దర్శనం చేసుకుని వస్తుండగా.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ..
X

దిశ, ఆమనగల్లు: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కాటన్ మిల్లు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన పోలీస్ ఈవెంట్‌లో ఉత్తీర్ణులైన 5 మంది యువకులు దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. దైవ దర్శనం అనంతరం భరత్ కుమార్(25), పవన్ కళ్యాణ్ (26), వీరేష్ (27), సుధాకర్, వినోద్ హైదరాబాద్‌లోని నల్లకుంటకు బయలుదేరగా.. ఆమనగల్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఒకరు అక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న 4 గురు యువకులకు ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నలుగురిని హైదరాబాద్‌కు తరలించారు.


Next Story