ఈ కళాశాల లేకుంటే నేను చదువుకునే దాన్ని కాదేమో : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 20 |
ఈ కళాశాల లేకుంటే నేను చదువుకునే దాన్ని కాదేమో : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, శంషాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు తగ్గట్టు మంచి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి గురువారం రెడ్డిసంఘం నాయకులతో కలిసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మానసహిల్స్ లో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చదువు కోసం ప్రాధాన్యత ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటారని అన్నారు. దాదాపు 300 కోట్ల విలువ చేసే పదివేలు ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కి కేటాయించడం హర్షణీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగానే యూనివర్సిటీ నిర్మించాలన్నారు. రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయ సాధన కోసం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి స్థాపించిన ఎడ్యుకేషన్ సొసైటీలో ఎంతోమంది చదివి మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలు, పై ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఈ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు ఇప్పించడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీగా రూపొందించాలన్నారు. నిర్మాణానికి గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ 10 కోట్లు ప్రకటించారని, దానిలో ఐదు కోట్లు నిర్మాణానికి విడుదల చేయాలని కమిటీ కోరారన్నారు. త్వరలో ఐదు కోట్ల నిధులు విడుదల చేయడానికి కృషి చేస్తానన్నారు. వసతి గృహానికి రావడానికి రోడ్డు మార్గానికి మరో ఎకరా స్థలం కావాలని కోరడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేటాయించేలా చూస్తానన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎంతో మంది రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సీఎం కేసీఆర్ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కి 15 ఎకరాల భూమి కేటాయించి, నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషమన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల క్రితమే బాలికలు చదువుకోవాలని ముందుకు వచ్చి హాస్టల్ నిర్మించిన గొప్ప మహానుభావుడు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అన్నారు. 75 ఏళ్ల తర్వాత భారత ప్రభుత్వం ఇప్పుడు బేటి పడావో బేటి బచావో నినాదాన్ని తీసుకువచ్చిందన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని కులసంఘాలకు స్థలాలు కేటాయించారన్నారు. రెడ్డి కళాశాలలో నేను కూడా చదువుకున్నానని రెడ్డి కళాశాల లేకుంటే నేను చదువుకునే దానిని కాదేమోనని అనిపిస్తుందన్నారు. ఇలాంటి గొప్ప ఆశయ సాధనను ప్రతి ఒక్కరిపై ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు.


Next Story

Most Viewed