- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..
by Disha Web Desk 20 |

X
దిశ, చౌదరిగూడ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. చౌదరిగూడ మండలం పీర్జాపూర్ గ్రామానికి చెందిన బోడంపాటి చెన్నయ్య, దశరథం, వెంకటయ్య, అంజయ్య, రాజు, సంగమేశ్వర్, ఆంజనేయులు ఇలా మొత్తం 150 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హఫీజ్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే అంజయ్య సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అన్ని వర్గాలకు సంక్షేమ పాలన కొనసాగుతున్నదని, అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్సీ చైర్మన్ దామోదర్ రెడ్డి, రాములు, ముస్తఫా, కేకే.కృష్ణ, గోపాల్ రెడ్డి, బోయ.రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
Next Story