నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి

by Disha Web Desk 23 |
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి
X

దిశ, తలకొండపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి సేవ చేయడమే ప్రజా ప్రతినిధుల ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్ గ్రామంలో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం నూతన గృహప్రవేశ ఆహ్వానానికి మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నారాయణరెడ్డి దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతి పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలను కాపాడుకుంటూ పేద ప్రజలకు సేవ చేసినప్పుడు నాయకులకు స్థానికంగా పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. మారుమూల ప్రాంతమైన చిన్న పల్లెటూరులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నూతనంగా ఇల్లు నిర్మించడం వల్ల పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నూతన గృహప్రవేశం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఎన్నికల వాతావరణాన్ని తలపించిన గృహప్రవేశం

నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కనివిని ఎరుగని రీతిలో సుమారు 25 వేల మందికి పైగా బహిరంగ సమావేశాన్ని తలపించే రీతిలో గృహప్రవేశానికి నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడంతో కసిరెడ్డి వర్గంలో ఆత్మ ధైర్యాన్ని పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడతారని కార్యకర్తలు గుసగుసలు అనుకుంటున్నారు. గృహప్రవేశానికి తరలివచ్చిన నేతలలో ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యేలు షాద్నగర్ ప్రతాప్ రెడ్డి, కల్వకుర్తి వంశీచందర్ రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, వైఎస్ఆర్ టిపి అర్జున్ రెడ్డి ఎంపీపీలు జడ్పీటీసీలు ఉప్పల వెంకటేష్, నిర్మల , బాలాజీ సింగ్ ,విజితా రెడ్డి, ఎడ్మ సత్యం ,అనిత, కమ్లి మోత్య నాయక్,భగత్, సర్పంచ్ వెంకటరామిరెడ్డి, నాయకులు పాండురంగారెడ్డి,గోలి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్,గుజ్జుల మహేష్, కుమార్, రవి, హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed