పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

by Sumithra |
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
X

దిశ, తాండూరు : రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించనున్నారు. హరీష్ రావుతో పాటు పౌర సమాచార, గనులు భూగర్భ జలవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయం ద్వారా ఒక ప్రకటనలు పేర్కొన్నారు.

పట్టణంలో రూ.25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కళాశాల భవనం నిర్మాణం కోసం శంకుస్థాపన, రూ.1కోటి రూపాయలతో గ్రంధాలయ నూతన భవనం, రూ.10 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలను చేశారు. అదేవిధంగా రూ.10.23 కోట్లతో తాండూరు ప్రాంతంలోని జినుగుర్తి, చంద్రవంచ, కందనెల్లి, జంటుపల్లి పరిధిలో సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో ఎంసీహెచ్ ఆవరణలో దుకాణాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజు గౌడ్, ప్రజా ప్రతినిధులు, శాఖల అధికారులు, బీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed