టేకు చెట్లను మింగేస్తున్న తిమింగళాలు..

by Disha Web Desk 20 |
టేకు చెట్లను మింగేస్తున్న తిమింగళాలు..
X

దిశ, చౌదరిగూడ : ఒక వైపు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో నర్సరీలో కోట్ల మొక్కలు పెంచి యజ్ఞంలా చేపడుతూ పెరిగిన చెట్లను మాత్రం కాపాడడంలో నిర్లక్ష్యం వల్ల అక్రమార్కులు యదేచ్ఛగా చెట్లను నరుకుతూ టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ శ్రమను, కృషిని బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచెర్ల శివారులో ఉన్న అడవిలో ఆదివారం AP24TB3079 నెంబర్ గల బులోరా వాహనంలో తరలిస్తూ ఉండగా ఒక వ్యక్తి చూసి దానిని అడ్డుకున్నారు. హాజర్ అనే వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ అంటూ సమాధానం ఇస్తూ బొలెరో వాహనం తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం హజార్ పెద్దఎల్కిచేర్ల వాచర్గా ఫారెస్ట్ బాధ్యతలు చూసే వ్యక్తిగా కొనసాగుతున్నాడు. కాపలా ఉండాల్సిన వాడే కలప రవాణా చేస్తూ గ్రామస్తులకు దొరికిపోయాడు. కంచె చేను మేసినట్టు ఉందని కలప రవాణా చేస్తున్న హాజర్ పై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed