అనుమతులు అవసరం లేదా..?

by Disha Web Desk 20 |
అనుమతులు అవసరం లేదా..?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : శివారు మున్సిపాలిటీలలో ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల వెనుక మున్సిపాలిటీ అధికారుల హస్తం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తుక్కుగూడ మున్సిపాలిటీల్లో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్, ఇమూమ గూడ, సర్దార్నగర్, దేవేందర్నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తులు, భవనాలు, శ్రీశైలం జాతీయ రహదారి, నెహ్రూ ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా షెడ్లు నిర్మిస్తున్నారు. అక్రమార్కులు, మున్సిపల్ అధికారుల అనుమతులతో సంబంధం లేకుండా ఇప్పటికీ పాత గ్రామ పంచాయతీ అనుమతులతో నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఆయా నిర్మాణాల వైపు అధికారులు కన్నెత్తి. చూడకపోవడం పట్ల పలుఅనుమానాలు, విమర్శలు వెలువెత్తుతున్నాయి.

భూముల ధరలకు రెక్కలు..

తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీశైలం జాతీయ రహదారి, ఔటర్ రింగు రోడ్డు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హర్డువేరు పార్కు, మంఖాల్ పారిశ్రామికవాడ, ఈ-సిటీ తదితర పరిశ్రమలు, వండర్లా వంటివి ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అనుమతులు తీసుకోవాలంటే ప్రభుత్వానికి లక్షల రూపాయాలు చెల్లించాల్సి వస్తుందని కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు చేపడుతున్నారు. మున్సిపల్ పరిధిలోతుక్కుగూడ ప్రధాన రోడ్డుపై అనుమతులు లేని కట్టడాలు జీప్లస్ టూ అనుమతులు మాత్రమే ఇవ్వాలి.

అంత కంటే ఎక్కువ కట్టుకోవాలంటే హెచ్ఎండీ నుంచి అనుమతి పొందాలి. కానీ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు, ఐదు అంతస్తులతో పాటు పెంట్ హౌస్ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. చాలామంది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తాము బహుళ అంతస్తులకు అనుమతులు తీసుకున్నామని చెబు తున్నారు. గ్రామ పంచాయతీల పాలనపోయి మున్సిపాలిటీలో దాదాపుగా నాలుగు సంవత్స రాలు దాటుతున్నా ఇప్పటికీ అవే అనుమతులు ప్రజలకు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

నోటీసులు ఇవ్వడం సెటిల్మెంట్లు చేయడం…

కేవలం నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మున్సిపాలిటీకి బదిలీపై వచ్చిన ఓ ఉన్నతాధికారి మున్సిపాలిటీ సిబ్బందిలో కొంతమందిని టీమ్గా ఏర్పాటు చేసి అక్రమ భవనాలు, షెడ్లను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి.. తెరవెనుక లక్షల రూపాయాలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శ్రీశైలం రహదారిపై షెడ్ల నిర్మాణం..

మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీశైలం జాతీయ మున్సిపాలిటీ రహదారి పై కొందరు వ్యాపారాలు ఆక్రమంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ఈ రోడ్డులో ఉన్న చాలావరకు భూములు గృహ నిర్మాణరంగం జోన్లో (రెసీ నోటీసులు డెన్షియల్) లేవు. దీంతో ఎలాంటి అనుమతులు, పత్రాలు లేకుండానే వందల గజాలా భూమిలో పెద్ద, పెద్ద షెడ్లను నిర్మించి ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జిలు, బార్ ను ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Next Story

Most Viewed