షార్ట్‌సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

by Aamani |
షార్ట్‌సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం
X

దిశ,మీర్ పేట్: షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్, ప్రశాంతి నగర్ ఫేస్ - 2 లో నివాసముంటున్న 1) డేరంగుల సైదులు, 2) దాసరి శ్రీనివాస్ ఇద్దరు ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంట్లో ఉన్న ఫ్రిజ్ , టీవీలు, ఫ్యాన్స్, బోరు మోటర్ లతోపాటు గృహోపకరణాలు పూర్తిగా దగ్దమైనట్టు బాధితులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లోని రేకులు సైతం లేచిపోయాయని, పక్కనే ఉన్న చెట్లు సైతం కాలిపోయినట్లు వారు తెలిపారు. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు కాలిపోవడంతో నిరాశ్రయులు అయిపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed