గుజరాత్ పరిశ్రమలు తెలంగాణ వైపు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
గుజరాత్ పరిశ్రమలు తెలంగాణ వైపు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మహేశ్వరం: టీఎస్ఐపాస్ ద్వారా కంపెనీల ఏర్పాటు సులభతరంగా ఉండటంతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కంపెనీల చూపు తెలంగాణ వైపు మళ్లిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఈ సిటీలో మహేశ్వరం నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల కృషితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహుళ స్థాయి కంపెనీలు వస్తున్నాయన్నారు. పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందుంజలో ఉందన్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు రవి నాయక్, రెడ్డిగల్ల సుమన్, బోధ యాదగిరి రెడ్డి, బాకీ విలాస్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed