ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన మాజీ ఎమ్మెల్యే

by Aamani |
ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ,ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం తుక్కుగూడ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి విజయవంతం కావడంతో సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కడ్తాల్ మండలంలోని పెద్దచెరువు తండాలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి,గిరిజనులతో కలిసి భోజనం చేశారు.సోమవారం ఉదయమే తండాలో ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలను వివరించారు.

అనంతరం మండల అధ్యక్షులు బిచ్య నాయక్ ఆధ్వర్యంలో మైసిగండి ప్రాంగణంలో ఓ ఫంక్షన్ హల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి,రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై చర్చించారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రతి కార్యకర్త విజయభేరిలో ప్రకటించిన కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు లోని ఆరు పథకాలను ప్రతి గడపకు చేరవేయాలని దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహా,మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి,ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు అజీమ్, రమేష్ నాయక్,జహంగీర్ బాబా తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed