సుల్తాన్ పల్లి భూమిలో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు : మాజీ సర్పంచ్ కాసుల చంద్రశేఖర్ గౌడ్

by Disha Web Desk 20 |
సుల్తాన్ పల్లి భూమిలో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు : మాజీ సర్పంచ్ కాసుల చంద్రశేఖర్ గౌడ్
X

దిశ, శంషాబాద్ : దమ్ముంటే ఆ భూమిని కోర్టులో ప్రభుత్వ భూమిగా నిరూపించాలని పీఎసీఎస్ మాజీ చైర్మెన్, మాజీ సర్పంచ్ కాసుల చంద్రశేఖర్ గౌడ్ సవాల్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 129, 142 లోని 25 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఈ భూమి అసలు పట్టాదారు వెంకట శివలింగం మృతి చెందిన అనంతరం ఆయన వారసులు పులిమామిడి నరసింహ, పులిమామిడి అశోక్, పులిమామిడి రవీందర్ పేర్ల మీద మొటేషన్ జరిగింది. ఆ ముగ్గురి వద్ద నుంచి 2005 సంవత్సరంలో కాసుల చంద్రశేఖర్ గౌడ్, దూడల వెంకటేష్ గౌడ్, టీఎల్ చారి, సెల్ డీడీ చేసుకున్నారన్నారు.

2007 సంవత్సరంలో సర్వేనెంబర్ 142లో బిలా దాఖల్ భూమి అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుల్తాన్ పల్లి గ్రామానికి చెందిన 84 మందికి ఇందిరమ్మ కింద పట్టాలు ఇచ్చారన్నారు. దాన్ని సవాలు చేస్తూ తమ పట్ట పొలంలో ఎలా ఇండ్ల పట్టాలిస్తారని హైకోర్టుకు వెళ్లామన్నారు. అప్పటినుండి వాదనలు ప్రతివాదనలు విన్నహైకోర్టు ఈ కేసును పూర్తిగా విచారించి తేల్చాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. దాని ఆధారంగా కలెక్టర్ ఈ భూమి ప్రైవేటు భూమిని, 2022లో కలెక్టర్ ప్రొసీడింగ్ ఆధారంగా పట్టాపాస్ పుస్తకాలు తమకు మంజూరు చేశారన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సుల్తాన్ పల్లి సర్పంచ్ దండు ఇస్తారి, మాజీ సర్పంచ్ సిద్దేశ్వర ముదిరాజ్ పట్టా భూమిని ప్రభుత్వ భూమని గ్రామస్తులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ప్రలోభ పెడుతూ లేని పోనీ ఆరోపణలు చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. 2007 సంవత్సరం నుండి హైకోర్టులో కేసు నడుస్తుంటే ఈ సర్పంచ్, మాజీ సర్పంచ్ ఎక్కడ పోయారని కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని, ఇప్పుడు కావాలనే రాజకీయం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాజకీయంగా ఎదురుకోలేని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డ్రామాలాడుతున్నాయన్నారు.

పట్టా ఇచ్చిన సర్టిఫికెట్ పైనే లిఖితపూర్వకంగా వివాదాస్పద భూమిలో పట్టాయి ఇస్తే రద్దు చేయబడుతుందని, అలాగే ఇచ్చిన సర్టిఫికెట్ ఆరు నెలల్లో నిర్మాణం చేయకపోతే పూర్తిగా చెల్లుబాటు కాదని ఈ నాయకులకు తెలియదా అన్నారు. ఈ భూమితో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎలాంటి సంబంధం లేదని ఆయన పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసిద్ధి లేదని హెచ్చరించారు. దమ్ముంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు నిజంగానే న్యాయం చేయాలి అని ఉంటే కోర్టుకెళ్ళి ప్రభుత్వ భూమి అని నిరూపించి పట్టా పాస్ పుస్తకాలు రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed