దిశ ఎఫెక్ట్​...‘సారా సిటీ’పై విచారణ

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్​...‘సారా సిటీ’పై విచారణ
X

దిశ, రాజేంద్రనగర్ : దిశ కథనానికి అధికారులు స్పందించారు. సారాసిటీ ఇష్టారాజ్యం పేరుతో ఇటీవల దిశ పత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్లో మూసీ నది సమీపంలో సారా సిటీ ప్రాజెక్టు నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించారు. ఇందులో భాగంగా రోడ్డును ఆక్రమించి టైల్స్ వేసి పార్కింగ్ కోసం దర్జాగా వినియోగిస్తున్నారు. అదే విధంగా కొన్ని రోజుల క్రితం వరకు భారీ టిప్పర్లతో ప్రాజెక్టు పిల్లర్ల కోసం

తీసిన గుంతల నుంచి మట్టి తరలించడంతో రోడ్డు ధ్వంసమైన విషయం తెలిసిందే. దిశ పత్రికలో సారా సిటీ నిర్వాహకుల ఇష్టారాజ్యంపై సమగ్ర కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ అధికారులు సారాసిటీ ప్రాజెక్టు వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తద్వారా చర్యలు తీసుకుంటామని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సారాసిటీ ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story