హస్తంతోనే కల్వకుర్తి అభివృద్ధి : సుంకిరెడ్డి

by Disha Web Desk 11 |
హస్తంతోనే కల్వకుర్తి అభివృద్ధి : సుంకిరెడ్డి
X

దిశ, ఆమనగల్లు :: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, హస్తం గుర్తుపై ఓటువేసి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో జంగారెడ్డిపల్లిలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వచ్చే ప్రభుత్వంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్, జిల్లా నాయకులు కృష్ణ నాయక్, మండల అధ్యక్షుడు జగన్, మాజీ ఉపసర్పంచ్ కేశవులు, నాయకులు ధనంజయ్, ఖాదర్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story