ఇబ్రహీంపట్నం అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే

by Kalyani |
ఇబ్రహీంపట్నం అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే
X

దిశ, ఇబ్రహీంపట్నం :- ఇబ్రహీంపట్నం అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం రోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రజాభవన్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులను అర్హులకు అందచేయడం, అంగన్వాడీలకు మెడికల్ కిడ్స్, చీరలు అందజేశారు. వివిధ గ్రామాల ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించి పరిష్కార దిశగా పనిచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఉప్పరిగూడ, పోచారం గ్రామాలలో నూతన సీసీ రోడ్ల శంకుస్థాపన, పోచారం గ్రామంలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా పోచారం గ్రామ ప్రజలు రైస్ మిల్లు నుండి వస్తున్న పొల్యూషన్ వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యేకు తెలుపగా రైస్ మిల్లులను పొల్యూషన్ లేకుండా నడపడానికి, లేదా ఇక్కడి నుంచి మరో చోటికి మార్చడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, ఎంపీపీ కృపేష్, మంకాల దాసు, రాచర్ల వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి చిన్న, జడల రవీందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed