రాజ్యాంగం ఒక వరం : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

by Disha Web Desk 15 |
రాజ్యాంగం ఒక వరం : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
X

దిశ చేవెళ్ల : ఆనాడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిర్మాణం చేసిన రాజ్యాంగం మనందరికి గొప్ప వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ అనుంబంధ గ్రామమైన నారాయణ్‌దాస్ గూడ గ్రామంలో శనివారం అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఆమె దళిత రత్న అవార్డు గ్రహీత బురాన్‌ ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవస్థలో సిస్టమ్‌ ఏర్పాటు చేసి సక్రమమైన సమాజ నిర్మాణంలో రాజ్యాంగం కీలక భూమిక అని, అలాంటి గొప్ప వరాన్ని మనకు అందించిన అంబేద్కర్‌ను మర్చిపోవద్దని పేర్కొన్నారు. ఒక వర్గానికే పరిమితం అవ్వకుండా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విధంగా రాజ్యాంగం అమలవుతున్నదన్నారు. గతంలో కంటే ప్రతి పౌరుడు తమ హక్కులను రాజ్యాంగం ద్వారా తెలుసుకొని ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ ప్రసాద్‌, సర్పంచ్‌ శేరి అరుధ సాయిరెడ్డి, విగ్రహ దాతలు కడమంచి నారాయన్‌దాస్, మాణెమ్మ, చేవెళ్ల అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్‌, దేవునిఎర్రవల్లి సర్పంచ్‌ సామ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌, కందవాడ ఎంపీటీసీ రవీందర్‌ యాదవ్‌, మండల టీఆర్‌ఎస్ యూత్‌ అధ్యక్షుడు శేఖర్‌, సివిల్‌ సప్లె జిల్లా సభ్యుడు రవీందర్‌, కౌకుంట్ల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, టీఆర్‌ఎస్ మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు రాములు, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, మల్కాపూర్‌ ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి,సీఐ వెంకటేశ్వర్లు,కళాకారులు, గ్రామస్తులు, అంబేద్కర్‌ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed