అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి: కలెక్టర్ నారాయణ రెడ్డి

by Disha Web Desk 11 |
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి: కలెక్టర్ నారాయణ రెడ్డి
X

దిశ ప్రతినిధి, వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తూ వాటి ఫలితాలను ప్రజలకు అందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ లతో కలిసి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న పారిశుధ్యం, హరితహారం, వైకుంఠధామాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, జాతీయ ఉపాధి హామీ పనులపై ప్రజా ప్రతినిధులు మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఏడు మాసాలలో ఎన్నికల ప్రక్రియలో పనిచేయాల్సి ఉంటుందని అంతలోపు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.

మండల స్థాయి కమిటీలు గ్రామస్థాయికి, జిల్లా స్థాయికి అనుసంధాన కర్తగా ఉంటూ పని చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్థాయిలో సర్పంచ్, విలేజ్ రెవెన్యూ అధికారి పంచాయతీ కార్యదర్శి కలిసికట్టుగా పనిచేస్తే పనులు వేగవంతంగా పూర్తి అవుతాయని కలెక్టర్ అన్నారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జనవరి నుంచి మే వరకు అనుకూల వాతావరణం ఉంటుందని ఇట్టి సమయంలో రోడ్స్ బిల్డింగ్స్ వేగవంతంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మిషన్ భగీరథ బాబు శ్రీనివాస్, డిఆర్డిఓ అడిషనల్ పీడీ స్టీవెన్ నీల్ లతో పాటు మండలాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed