వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించిన సీఎం కేసీఆర్..

by Kalyani |
వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించిన సీఎం కేసీఆర్..
X

దిశ, తాండూరు రూరల్ : చరిత్రలో ఎవరూ చేయని విధంగా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరూపించారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు అన్నారు. తాండూరు మండలం చెంగోల్, సిగిరిగి పేట్, ఐనెల్లి, బేల్కటూరు, ఇతర గ్రామాల్లో శనివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ రైతు వేదికల్లో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లు మాట్లాడుతూ..రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్ట్టి వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తుందన్నారు. సుమారు 300 మంది రైతులు సమావేశం జరుపుకునే విధంగా రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు. కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధు లు పనిచేయాలన్నారు.

రాష్ట్రం వచ్చిన తర్వాత సాగు నీటి వసతి, 24 గంటల విద్యుత్‌, రైతు బందు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూసుకుంటోందన్నారు. రైతులు కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు. గత పాలకులు రైతుల క్షేమాన్ని విస్మరించారన్నారు. అవినీతి లేకుండా పారదర్శకమైన పాలనను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజు గౌడ్, ఆర్డిఓ అశోక్ కుమార్, ఎంపిపి అనిత, జడ్పిటిసి మంజుల, వైస్ ఎంపిపి స్వరూప, సర్పంచులు స్వాతిజ్యోతి, రాధిక, మాలేశ్వరి గౌడ్, మధుసూదన్, తహసీల్దార్ చిన్నపలనాయుడు, ఎంపిడిఓ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed