భూదాన్ భూమికి ఎసరు..!

by Disha Web Desk 20 |
భూదాన్ భూమికి ఎసరు..!
X

దిశ, మహేశ్వరం : దళితులకు చెందిన భూదాన్ భూమికి అక్రమార్కులు ఎసరు పెట్టారు. మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 435 లోని 12 ఎకరాల 17 గుంటలు భూమిని మంఖాల్ గ్రామానికి చెందిన అక్కంగారి లక్ష్మయ్య , అక్కంగారి బాలయ్య, అక్కంగారి యాదయ్య , అక్కంగారి నర్సింహా, అక్కంగారి రామ చంద్రయ్య పేర్ల మీద ఆంధ్రప్రదేశ్ భూధాన్ యజ్ఞ బోర్డు. భూదాన్ సమితి పట్టదారునిగా జనవరి 3 తేదీన 1979 సంవత్సరంలో 12.17 గంటల భూమిని కేటాయించారు. కొన్నాళ్ళు భూమిని అక్కంగారి కుటుంబ సభ్యులు సాగు చేశారు. భూ యాజమాని అక్కంగారి లక్ష్మయ్య జనవరి 6న 1986లో మరణించారు.

అక్కంగారి లక్షయ్య ఆగస్టు 6 1986 సంవత్సరంలో తన 12.17 గుంటల భూమిని ఎ.హరికృష్ణ,లక్ష్మి నారాయణ అమ్మాడాన్ని ఎ.హరికృష్ణ, లక్ష్మి నారాయణ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి 12.17 గంటల భూదాన్ భూమినీ స్వాదీనం చేసుకున్నారు. 1994-2012 వరకు గజ్జెల శశికల రెడ్డి మీద కబ్జాదారులుగా, పట్టాదారునిగా మార్చారు. గజ్జెల శశికళ రెడ్డి కబ్జాదారునిగా, ఖాస్తు కాలంలో పేరును నమోదు చేశారాన్ని బాధితులు ఆరోపిస్తున్నారు. 2011 సంవత్సరంలో ఓ దిన పత్రికలో వచ్చిన కథనానికి లోకాయుక్త సుమోటోగా కేసునమోదు చేసింది. లోకాయుక్త మంఖాల్ రెవిన్యూ పరిధిలోని సర్వేనంబర్ 435లో 12.17 ఎకరాల భూదాన్ భూమిపై దర్యాప్తు చేట్టాలని అప్పటి కలెక్టర్, తహశీల్దార్ కు, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేశారు.

అప్పటి తహశీల్దార్ 12.17 గుంటల భూదాన్ భూమినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని బోర్డు పాతారు. గజ్జెల శశికళ రెడ్డి మీద అప్పటి తహశీల్దార్ మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్జెల శశికళ రెడ్డి తహశీల్దార్ పాతిన బోర్డును శశికళ రెడ్డి బోర్డును తొలగించి భూమిని సాగు చేసుకుంటుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం నేటికీ భూధాన్ భూమిగానే చూపిస్తుంది. అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న మా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed