విద్యుత్ కోతలతో... రైతులకు వెతలు..

by Disha Web Desk 20 |
విద్యుత్ కోతలతో... రైతులకు వెతలు..
X

దిశ, చౌదరిగూడ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం 12 లేదా14 గంటలకు మించి త్రీ ఫేజ్‌ కరెంట్‌ సరఫరా కావడం లేదు.రాత్రి వేళలో కరెంట్‌ ఇవ్వడంతో రైతులు మళ్లీ బోరు బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండలంలో యాసంగి వరి నాట్లు వేస్తుండడంతో. వాస్తవానికి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుండటంతో పొలాలకు చివరి మడి తడిసే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందనే భయం రైతులను వెంటాడుతుంది.

వరి వైపే మొగ్గు చూపుతున్న రైతులు..

మండలంలో యాసంగి సీజన్ లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు మండలంలో అత్యధికంగా 5004.28 ఎకరాలు వరి నాట్లు వేయగా. అదేవిధంగా మొక్కజొన్న 208 ఎకరాలు కూరగాయలు296.14 ఎకరాలు జోన్న 95 ఎకరాలు వంటి వివిధ పంటలు రైతులు సాగు చేస్తున్నారు.

బోరు బావులే దిక్కు..

యాసంగిల్లో వరి సాగుతో పాటు వివిధ ఆరుతడి పంటలు బోరు బావుల ఆధారంగానే సాగవుతోంది. షాద్ నగర్ నియోజకవర్గనికి సంబంధించి మండలంలో తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన లక్ష్మీదేవిపల్లి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం లేకపోవడంతో యాసంగిలో బోరు బావులపైనే రైతులు పంటలను సాగు చేస్తుంటారు.



Next Story