415 కిలోల నకిలీ విత్తనాలు సీజ్

by Sridhar Babu |
415 కిలోల  నకిలీ విత్తనాలు సీజ్
X

దిశ, తాండూరు/బషీరాబాద్ : 415 కిలోల నకిలీ విత్తనాలు సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్టు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు బషీరాబాద్ ఎస్ఐ రమేష్ కుమార్ తన సిబ్బందితో పాటు ,స్థానిక వ్యవసాయ అధికారులు వెన్నెల, సూర్య ప్రకాష్ ల బృందం ఏక్మాయి గ్రామానికి వెళ్లగా అక్కడ ఇద్దరు వ్యక్తులు నకిలీ విత్తనాలు కలిగిన రెండు సంచులను తరలిస్తుండగా పట్టుకుని విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 415 కేజీలు విత్తనాలను రైతులకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నకిలీ పత్తి విత్తనాలని దౌల్తాబాద్ మండలం వీర్లపల్లి గ్రామస్తుడు వెంకట్రాములు దగ్గర నుంచి తీసుకొని వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

బషీరాబాద్ మండల పరిధిలో తెలిసిన అమాయకులైన రైతులకు ఏక్మాయి గ్రామంలో అమ్మడానికి రాగా విశ్వసనీయ సమాచారం మేరకు వారిని పట్టుకున్నామని వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బోయింది విఠలప్ప, దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన చిన్న గుంట వెంకట్రాములు లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలను అమాయకులైన రైతులకు విక్రయించి వాటి ద్వారా అధిక దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పి రైతులనుండి ఒక్కో కేజీకి రూ 1800 రూపాయల చొప్పున డబ్బు వసులు చేస్తున్నట్లు చెప్పారు. గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలనే విక్రయించాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed