గోషామహల్‌లో పట్టు నిలుపుకున్న రాజాసింగ్.. భారీ ఆధిక్యం

by Disha Web Desk 12 |
గోషామహల్‌లో పట్టు నిలుపుకున్న రాజాసింగ్.. భారీ ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాలకు గాను 65 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. అయితే బీజేపీ ప్రధాన అభ్యర్థులు ఓటమి బాటలో ఉండగా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం తన పట్టును నిలుపుకున్నాడు. 11 రౌండ్లు ముగిసే సరికి దాదాపు 20 వేలకు పైటా మెజారిటీలో ఉన్నా రాజాసింగ్.. తన కంచుకోటలో హట్రిక్ విజయం వైపు నడుస్తున్నాడు. కాగా మరో రెండు ఈవీఎమ్ పాడ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆలస్యంగా కౌంటింగ్ జరుగుతోంది.Next Story