పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన

by Disha Web Desk 5 |
పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : వాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, యాదాద్రి, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెళ్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.


Next Story