ISRO: నేడు పీఎస్ఎల్వీ సీ -57 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్

by Rajesh |
ISRO: నేడు పీఎస్ఎల్వీ సీ -57 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు పీఎస్ఎల్వీ సీ - 57 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ - 1 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది. 24 గంటల కౌంట్ డౌన్ తర్వాత ఆదిత్య ఎల్ - 1 నింగిలోకి దూసుకెళ్లనుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ - 57 ప్రయోగం చేపట్టనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్ - 1ని శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. ఇక, శ్రీహరికోటలోని షార్ లో పరిస్థితిని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ సమీక్షిస్తున్నారు.

Next Story

Most Viewed