రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ

by Disha Web Desk 9 |
రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాబోతున్నది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడుపనున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్‌ నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు మరో మూడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు గురువారం ఎస్‌సీఆర్‌ అధికారులు వెల్లడించారు.

అలాగే సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ స్టేషన్ల మధ్య రూ.1,410 కోట్లతో నిర్మించిన 85.24 కిలోమీటర్ల దూరం డబుల్‌ లైను, విద్యుదీకరణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే రూ.720 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన వేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్‌కు సంబంధించిన 13 నూతన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed