తెలంగాణలో మార్పు తధ్యం.. వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకం: మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
తెలంగాణలో మార్పు తధ్యం.. వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకం: మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ప్రజలు గతంలోనే ఫామ్ హౌస్ సీఎంకు ట్రైలర్ చూపించారు.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఫామ్ హౌస్ సీఎంకు పూర్తి సినిమా చూపిస్తారని ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మోడీ జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ తొలి సీఎం బీసీయే అవుతారని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మోడీ కరీంనగర్ బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతోంది.. వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్‌కు ఎంతో కీలకమని అన్నారు. పదేళ్ల బాలుడి భవిష్యత్ కోసం అతడి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు.. అలాగే పదేళ్ల వయసున్న తెలంగాణకు వచ్చే ఐదు సంవత్సరాలు ఎంతో ముఖ్యమన్నారు. తెలంగాణ వచ్చే ఐదేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ కావాలని మోడీ ఆకాంక్షించారు. తెలంగాణ భవిష్యత్‌ కోసం రాష్ట్రంలో బీజేపీ సర్కార్ రావాల్సిన అవసరం ఉన్నదని, అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికార మార్పు గాలి వీస్తోందని.. మార్పు తథ్యం అన్నారు.

Next Story

Most Viewed