T - Congress: అధికారమే లక్ష్యంగా భారీ స్కెచ్!

by Disha Web Desk 4 |
T - Congress: అధికారమే లక్ష్యంగా భారీ స్కెచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ భారీ స్కెచ్ వేస్తోంది. ఈ మేరకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా స్కెచ్ వేస్తోంది. త్వరలో పార్టీ నేతలతో జాతీయ నాయకత్వం భేటీ కానుంది. కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇతర పార్టీల స్థితిగతులపై సైతం ఈ భేటీలో అధిష్టానం సమీక్షించనుంది.

సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులతో సైతం పార్టీ పెద్దలు భేటీ కానున్నారు. మాజీ మంత్రులు, సీనియర్లతో సమావేశాలపై లోతైన చర్చ జరపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే సర్వేలు నిర్వహించిన ఆయా రాష్ట్రాల్లో పార్టీకి బలంపై ఆరా తీసే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అధికారంలోకి వచ్చేందుకు పార్టీ పరంగా అనుసరించే వ్యూహాంపై సమీక్ష చేపట్టనుంది.

నాయకుల అభిప్రాయాల ఆధారంగా పార్టీ బలోపేతానికి రోడ్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నట్లు తెలిసింది. పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలపైనా ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి చేరిక దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో మరింత మంది ముఖ్య నేతలను చేర్చుకునేలా పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.

అయితే పొంగులేటి, జూపల్లి చేరిక విషయంలో సునీల్ కనుగోలు సైతం రంగంలోకి దిగారని, వీరిద్దరితో ఆయన చర్చించినట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల మేరకు ఇరువురు ముఖ్య నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగిసిన తర్వాత చేరిక తేదీ ఫిక్స్ కానున్నట్లు సమాచారం.

అధిష్టానం తెలంగాణపై ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలనే ఇక్కడ రిపీట్ చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలితాలు చూపుతాయనేది చూడాల్సి ఉంది.

Also Read

టీ - కాంగ్రెస్‌లో తెరమీదకు మరో సంచలన అంశం!



Next Story

Most Viewed