రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది.. పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది.. పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యతగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య సూచించారు. సోమవారం పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రేవంత్ అబద్ధాలు ప్రచారాం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ భవన్‌లో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అని కేసీఆర్ అన్నారు. గతంలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను కేసీఆర్ ఉదాహరించారు. ఓ సీనియర్ కాంగ్రెస్ నేత 20 ఎమ్మెల్యేలను తీసుకొస్తా అంటే వారించా అని కేసీఆర్ ఆ రోజు చెప్పారు. రేవంత్ మాత్రం ప్రతీ సభలో కేసీఆర్ తన ప్రభుత్వానికి కూలుస్తారన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.

ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఎంత టైమ్ పడుతుందో సామాన్యుడికి ఉన్న అవగాహన కూడా సీఎంకు లేదు అని మండిపడ్డారు. గ్యారంటీలు అమలు చేయమంటే వాటి గురించి సీఎం మాట్లాడటం లేదు. జానారెడ్డి, జైపాల్ రెడ్డిలు అనుభవజ్ఞులు. వారి గురించి కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పాలన అనుభవం శూన్యం. లాగులో తొండలు అని ఏదో భాష మాట్లాడుతున్నారు. పాలన చేయమంటే పనికి రాని మాటలు చెబుతున్నాడు. దేవుళ్ల మీద ప్రమాణం చేయడం కాదు, గతంలో చెప్పిన డెడ్‌లైన్లపై నిలబడు అని హితవు పలికారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిజాలు దాస్తోందన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడమే నాకు సిగ్గు అనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాతలను మోసం చేస్తున్న రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి అని పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది సీఎంలను చూశాం, నిన్ను కూడా కొన్ని రోజులు చూస్తాం అని ప్రకటించారు.

Read More...

కరీంనగర్ అభివృద్ధికి మీరేం చేశారో చెప్పండి?: ఎంపీ అభ్యర్థి



Next Story