ఈటలతో భేటీ.. బీజేపీలో చేరికపై పొంగులేని రియాక్షన్ ఇదే

by Disha Web Desk 2 |
ఈటలతో భేటీ.. బీజేపీలో చేరికపై పొంగులేని రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఈటల రాజేందర్‌తో భేటీ అనంతరం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆశయాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలని బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు పిలుపునిచ్చారు. తాను ఇదే విషయమై అనేక వేదికల మీద చెప్పానని.. ఏ లక్ష్యంతో అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చామో ఆ లక్ష్యం నెరవేర్చే దిశగానే ఇవాళ బీజేపీ నేతలతో సమావేశం జరిగిందని అన్నారు.

కేసీఆర్‌ను గద్దె దింపడమే మా అందరి లక్ష్యమని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. కానీ, ప్రస్తుతం తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలని అన్నారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని, ఇంకా చాలా మందితో మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కేసీఆర్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని, ఎలా గెలుస్తాడో తానూ చూస్తానని సవాల్ విసిరారు.


Next Story

Most Viewed