పొంగులేటి నివాసంలో కొనసాగుతున్న చర్చలు.. కాసేపట్లో వీడనున్న సస్పెన్స్!

by Disha Web Desk 2 |
పొంగులేటి నివాసంలో కొనసాగుతున్న చర్చలు.. కాసేపట్లో వీడనున్న సస్పెన్స్!
X

దిశ, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత అయన ఇంకా ప్రజలకు దగ్గర అయ్యారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గా్ల్లో 9 నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి సత్తాను రాష్ట్రానికి చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతారా? కాంగ్రెస్‌లో చేరుతారా? అనే ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో అనూహ్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందనరావుతో పాటు మరి కొందరు బీజేపీ నాయకులతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం మధ్యాహ్నం ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి రావడంతో ఇంకా రాజకీయాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వచ్చిన అతిథులకు భోజనాలు తర్వాత సుమారు 3 గంటల పాటు బీజేపీ చేరికలు కమిటీ సభ్యులు సుదీర్ఘ చర్చలు చేస్తున్నారు. ఈ చర్చలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉండటంతో రాజకీయ చర్చలు ఆసక్తిగా మారింది. మరోవైపు పొంగులేటి అభిమానులు బీజేపీ పార్టీకి ఎలాంటి హామీ ఇవ్వలేదు చెబుతున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారని చెబుతున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహిస్తారని పొంగులేటి నివాసం వద్ద పడికాపులు కాస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీలో చేరుతారా? లేదా? అనే టెన్షన్ మరికొద్ది గంటల్లో వీడనుంది.


Next Story

Most Viewed