వాహనదారులకు గమనిక.. పోలీస్ స్టిక్కర్ ఉన్నా ఛలాన్ తప్పదు..

by Disha Web Desk 4 |
వాహనదారులకు గమనిక.. పోలీస్ స్టిక్కర్ ఉన్నా ఛలాన్ తప్పదు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీస్ శాఖ సీరియస్‌గా వ్యవహరించనుంది. ఇందులో భాగంగా వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్ చేయించేందుకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ కారు ప్రమద ఘటన తర్వాత పోలీసు,ప్రెస్, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వివిధ హోదాలతో స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వాహనాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 'PRESS' స్టిక్కర్లతో రోడ్డెక్కిన వాహనాలను గుర్తించి రూ.700 ఫైన్స్ వేస్తున్నారు. అయితే, ప్రభుత్వం జర్నలిస్టుగా గుర్తించి అక్రిడేషన్ కార్డును అందించినప్పటికీ ప్రెస్ స్టిక్కర్ వేసుకోనివ్వారా అంటూ ప్రశ్నించి.. పోలీసులు స్టిక్కర్ వేసుకోవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందించి 'POLICE' స్టిక్కర్ ఉన్న వాహనాలపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా, రోడ్డుపైనే వాహనాలను నిలిపివేసి స్టిక్కర్లను తొలగిస్తున్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం అందరూ సమానమే అని పోలీసులు చెబుతున్నారు.

Next Story

Most Viewed