ఫూలే జయంతి ఎఫెక్ట్: YS షర్మిలపై సొంత పార్టీ నేతలు సీరియస్

by Disha Web Desk 2 |
ఫూలే జయంతి ఎఫెక్ట్: YS షర్మిలపై సొంత పార్టీ నేతలు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మునుషులంతా సమానత్వంతో జీవించాలని పోరాడిన వ్యక్తి, ఆధితప్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆలోచనలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటిది వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పూలే జయంతికి దూరంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు షర్మిల దూరంగా ఉండటం ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఆమె పలువురు సంఘ సంస్కర్తల జయంతి, వర్ధంతికి దూరంగానే ఉన్నారు. అయితే తాజాగా పూలే జయంతికి దూరంగా ఉండటంపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీసీలంటే షర్మిలకు చిన్న చూపని, అందుకే వివక్ష చూపుతోందని వారు చెబుతుండటం గమనార్హం. బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచిన వారిపై ఇలా వివక్ష చూపడం తగునా? అని సొంత పార్టీ నేతలే ఆమెపై గుర్రుగా ఉన్నారు. షర్మిల ఇకనైనా తన వైఖరి మార్చుకుంటే దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఆమెకు మద్దతుగా నిలుస్తారని, లేదంటే బీసీల మద్దతు దొరకదని వాపోయారు. నిరుద్యోగ దీక్షకు మద్దతు తెలపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి లేఖ రాసిన షర్మిలకు ఫూలే జయంతికి హాజరయ్యే తీరిక లేకుండా పోయిందా? అని విమర్శలు చేస్తున్నారు.

Also Read..

MLC కవిత పోరాటానికి డెన్మార్క్ ఎన్నారైల మద్దతు



Next Story

Most Viewed