కేసీఆర్ జాతీయ పార్టీకే జై కొట్టిన ఓవైసీ

by Disha Web Desk |
కేసీఆర్ జాతీయ పార్టీకే జై కొట్టిన ఓవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కు విషెస్ చెప్పారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు.. జాతీయ పార్టీకి నా విషెస్ చెబుతున్నా అని అసుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీకి శుభాకాంక్షలు చెప్పడంతో ఓవైసీ బీఆర్ఎస్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతుంది. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఓవైసీ ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా అలాగే అండదండలు అందిస్తారనేది తెలుస్తోంది.

ALSO READ : కేసీఆర్ ఈజ్ ఆదిపురుష్.. వర్మ ట్వీట్ వైరల్

Read Disha E-paper

Next Story

Most Viewed