కేసీఆర్ ఈజ్ ఆదిపురుష్.. వర్మ ట్వీట్ వైరల్

by Disha Web |
కేసీఆర్ ఈజ్ ఆదిపురుష్.. వర్మ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. వర్తమాన విషయాలపై సంచలన ట్వీట్స్ చేస్తూ అందరినీ షాక్ ‌కు గురి చేస్తుంటారు. తాజాగా వర్మ పెట్టిన ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సారి ఆయన సినిమా విషయాలు కాకుండా గులాబీ దళపతి కేసీఆర్‌పై కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

కేసీఆర్.. ఇప్పటి వరకు కొనసాగిన టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వర్మ తనదైన స్టైల్‌లో ఓ ట్వీట్ చేశారు. ''టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా, కేసీఆర్ ఆదిపురుషుడు (మొదటి వ్యక్తి) అయ్యాడు.. జాతీయ రాజకీయాలకు స్వాగతం'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్.. ''వర్మ కేసీఆర్‌ను పొగిడాడా.. తిట్టాడా'' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : కేసీఆర్ జాతీయ పార్టీకే జై కొట్టిన ఓవైసీ
Next Story

Most Viewed