ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రాక్టీస్​కు 'అనాధ శవాలు'.. సర్కార్ ప్లాన్

by Disha Web Desk 4 |
ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రాక్టీస్​కు అనాధ శవాలు.. సర్కార్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా లభించిన అనాధ శవాలను మెడికల్​ కాలేజీలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటిని ఎంబీబీఎస్ విద్యార్ధుల ప్రాక్టీస్​కు వినియోగించాలని ప్లాన్​చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న రూల్స్​లో కొన్ని సవరణలు చేయనున్నారు. న్యాయ పరమైన చిక్కులు రాకుండా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం మంత్రి హరీష్​రావు డీజీపీ మహేందర్​రెడ్డి, హెల్త్​ఆఫీసర్లతో భేటీ అయ్యారు. పూర్తిస్థాయిలో సమీక్షించి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం సీఎం కేసీఆర్​వద్దకు ఈ ప్రపోజల్ పంపినట్టు ఉన్నతాధికారుల్లో ఒకరు చెప్పారు. సీఎంవో నుంచి పర్మిషన్లు రాగానే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.

కాలేజీలు పెరగడంతోనే.....

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మెడికల్​ కాలేజీ చొప్పున ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కొత్త కాలేజీలను అనుమతిచ్చే నేషనల్​మెడికల్​కమిషన్​ కూడా ఇటీవల విజిట్​ చేసి వివరాలను సేకరించింది. దీంతో వచ్చే అకాడమిక్​సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఎంబీబీఎస్​కోర్సు చేస్తున్న విద్యార్ధులకు ప్రాక్టీస్​​చేసేందుకు డెడ్​బాడీలు ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతాయి. దీంతో అనాధ శావాలను కొత్త మెడికల్​ కాలేజీలకు తీసుకోవాలని హయ్యర్​ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సర్కార్​ కూడా ఈ నిర్ణయానికి సుముఖంగానే ఉన్నది. సీఎం కేసీఆర్​ఫైనల్​ డెసిషన్​ తీసుకోగానే ఈ విధానం అమల్లోకి రానున్నది.

పక్క రాష్ట్రాల నుంచి...

మన దగ్గర ప్రస్తుతం ఉన్న రూల్స్​తో అనాధ డెడ్​ బాడీలను మెడికల్​ కాలేజీలకు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొన్ని సార్లు కర్ణాటక, తమిళనాడుల నుంచి తీసుకురావాల్సి వస్తుందని ఓ అధికారి చెప్పారు. ప్రైవేట్​ మెడికల్​ కాలేజీలన్నీ ఎక్కువ శాతం ఇదే విధానాన్ని ఫాలో కావడం గమనార్హం.

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో...

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనాధ శావాలు లభిస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించి కొన్ని రోజుల వరకు ప్రీజర్​ లో ఉంచి కోర్టు ఆదేశాలతో పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు చేయాలి. కానీ ప్రస్తుతం పోస్టు మార్టం అనంతరం పోలీసులు లేకుండానే కొన్ని సార్లు జీహెచ్​ఎంసీ స్టాఫ్​నేరుగా అంత్యక్రియలు చేసేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


Next Story

Most Viewed