కడ్తా పేరిట మిల్లర్ల బహిరంగ దోపిడీ.. మంత్రి ఆదేశాలు డోంట్ కేర్

by Disha Web Desk 4 |
కడ్తా పేరిట మిల్లర్ల బహిరంగ దోపిడీ.. మంత్రి ఆదేశాలు డోంట్ కేర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మొన్నటి వరకు తాలు, తడిసిన ధాన్యమంటూ మొండికేసిన రైస్ మిల్లర్లు.. ప్రస్తుతం కడ్తా, తరుగు అంటూ అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలను రైసుమిల్లర్లు, సొసైటీలు ఏ మాత్రం ఖాతర్ చేస్తలేరని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 401 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు సంకల్పించగా ఇటీవల ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాలతో 394 మాత్రమే ప్రారంభించారు. వీటిలో 15 కేంద్రాలను మూసివేశారు. శనివారం వరకు జిల్లాలో 5 లక్షల 3 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కడ్తా లేకుండా తూకం వేయడం లేదు. గోనే సంచి బరువు 700 గ్రాములుగా ఒక్కొక్క బస్తాలో 40 కిలోల చొప్పున తూకం వేయాల్సి ఉండగా 44 కిలోల తూకం అయితేనే కాంట చేస్తున్నారు.

చివరకు రైసుమిల్లుకు వెళ్లిన ధాన్యం గ్రేడ్‌ను బట్టి 7 కిలోల నుంచి 10 కిలోల తరగును తీస్తున్నారు. ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినప్పుడే వారికి ఇవ్వాల్సిన ట్రాక్ షీట్‌ను ఇవ్వడం లేదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసి లోడ్ చేసి మిల్లులకు పంపిస్తే అక్కడ లారీలో ఉన్న సరుకు ఆధారంగా, తరుగు తీస్తే గానీ ధాన్యాన్ని అన్ లోడ్ చేయడం లేదు. ఏదైనా అంటే డైరెక్ట్ మిల్లర్ నేరుగా సొసైటీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తుండడంతో వారు నేరుగా రైతులకు తరుగు విషయాన్ని వెల్లడించి ధాన్యం అన్‌లోడ్ మీ చేతుల్లో ఉందని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తరుగుకు అంగీకరిస్తున్నారు. కాగా ఒక్కొక్క క్వింటాల్‌కు సుమారు 7 కిలోల నుంచి 10 కిలోల తరగు తీస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా మంత్రి వేముల ఈ దోపిడీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అన్నదాతలు కోరుతున్నారు.

- దిశ ప్రతినిధి, నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో రైతులు పట్టపగలు దోపిడీకి గురవుతున్నారు. రైతులను తరుగు పేరిట, కడ్తా పేరిట దోపిడీ చేయవద్దని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేసిన ఆదేశాలు అమలవుతలేవు. రైసుమిల్లర్లు, సొసైటీలు కుమ్మకై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కడ్తా లేకుండా తూకం వేయడం లేదు. గోనే సంచి బరువు 700 గ్రాములుగా ఒక్కొక్క బస్తాలో 40 కిలోల చొప్పున తూకం వేయాల్సి ఉండగా 44 కిలోల తూకం అయితేనే కాంట చేస్తున్నారు. చివరకు రైసుమిల్లుకు వెళ్లిన ధాన్యం గ్రేడ్‌ను బట్టి 7 కిలోల నుంచి 10 కిలోల తరగును తీస్తున్నారు. ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినప్పుడే వారికి ఇవ్వాల్సిన ట్రాక్ షీట్‌ను ఇవ్వడం లేదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసి లోడ్ చేసి మిల్లులకు పంపిస్తే అక్కడ లారీలో ఉన్న సరుకు ఆధారంగా, తరుగు తీస్తే గానీ ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడం లేదు.

ఏదైనా అంటే డైరెక్ట్ మిల్లర్ నేరుగా సొసైటీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తుండడంతో వారు నేరుగా రైతులకు తరుగు విషయాన్ని వెల్లడించి ధాన్యం అన్‌లోడ్ మీ చేతుల్లో ఉందని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తరుగుకు అంగీకరిస్తున్నారు. కాగా ఒక్కొక్క క్వింటాల్‌కు సుమారు 7 కిలోల నుంచి 10 కిలోల తరగు తీస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొన్నటి వరకు తాలు, తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి కొర్రీలు పెట్టిన మిల్లర్లు చివరకు ధాన్యం గ్రేడ్ 1గా ఉన్న దానిని తీసుకునేందుకు కడ్తాకు అంగీకరిస్తేనే ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకుంటున్నారు. లేకపోతే లారీలలోనే, ట్రాక్టర్ లలోనే సరుకు మగ్గిపోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాలుగైదు రోజుల సమయం పడుతుండగా, అదే సమయంలో మిల్లర్ల వద్ద అన్ లోడింగ్‌కు సమయం పడుతుండడంతో రైతుల దోపిడీ యధాతథంగా కొనసాగుతుంది.

నిజామాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదని, సేకరణ లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను తెరిచారు. శనివారం వరకు జిల్లాలో 5 లక్షల 3 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్ల వద్దకు 4 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ట్రాన్స్ పోర్టులో నే ఉన్నట్లు చెబుతుండగా అంతకుమించి ఉన్నాయని విమర్శలున్నాయి. గ్రేడ్ 1 రకం ధాన్యమైన మరేదైనా సరే కచ్చితంగా తరుగు తీస్తున్నారని చెప్పాలి. దీంతోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద కనీసం 4 రోజులు మించి తూకం వేసిన తర్వాతనే లోడింగ్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 800 లారీలను ధాన్యం సేకరణ ట్రాన్స్ పోర్టుకు వినియోగిస్తుండగా, అవి ధాన్యం లోడింగ్ చేసుకుని గోదాముల వద్ద, మిల్లర్ల వద్ద అన్ లోడింగ్ చేసేందుకు సమయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

జిల్లాలో 218 రైసుమిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిగాయి. అందులో 123 రా రైసుమిల్లులు ఉండగా 95 పారా బాయిల్డ్ రైసుమిల్లులు ఉన్నాయి. వీటిని 60 క్లస్టర్లుగా విభజించి 60 మంది జిల్లా స్థాయి అధికారులను ధాన్యం సేకరణలో పర్యవేక్షణ కోసం నియమించారు. కానీ ఎక్కడ కూడా ధాన్యం తరుగు తీయకుండా నిలువరించలేకపోతున్నారు. ఈ నెల మొదటి వారంలో తడిసిన ధాన్యం తీసుకోవడానికి మొండికేసిన మిల్లర్లు తర్వాత నాణ్యమైన సీఎంఆర్ తీసుకోవడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ధాన్యం సేకరణ సందర్భంగా రైతులను తరుగు, కడ్తా పేరిట ఒక్క క్వింటాల్ కే 7 కిలోల నుంచి 10 కిలోల కోత విధిస్తున్న ఒక్క రైసుమిల్లుపై చర్య తీసుకున్న దాఖలాలు లేవు. నిత్యం సొసైటీల సీఈవోలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్షలు జరుగుతున్నా ఎక్కడ కూడా కడ్తాను అడ్డుకోవాలని అధికారుల ఆదేశాలు లేకపోవడం విడ్డూరంగా ఉంది. కేవలం రైతుల నుంచి ప్రతి సీజన్ లో జరిగే దోపిడీ రూ. కోట్లలో ఉంటుందని చెప్పాలి. ఈ యేడాది 7 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాల్సి ఉండగా, ఇప్పటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరుగడంతో ఇప్పటి వరకు కోతలకు అడ్డుపడకపోవడంతో రైతుల వేదన అరణ్యరోదనగా మారింది.



Next Story

Most Viewed