NTR : తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్.. వెంకయ్యనాయుడు

by Rajesh |
NTR : తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్.. వెంకయ్యనాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు తెలిపారు. పురాణ పాత్రల్లో ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేసి ఎన్టీఆర్ ప్రజలను మెప్పించారన్నారు. రాజకీయాల్లో నవశకానికి నాంది పలికారని కొనియాడారు. ఎన్టీఆర్.. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని తెలిపారు. నిరంకుశ రాజకీయాలకు ఎన్టీఆర్ ఎదురొడ్డి నిలిచారని స్పష్టం చేశారు. నందమూరి తారకరామరావు గొప్ప సంస్కరణ వాది అని కొనియాడారు.



Next Story

Most Viewed