బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి ఎన్ఎస్‌యూఐ యత్నం

by Mahesh |
బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి ఎన్ఎస్‌యూఐ యత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ తో ఎన్ఎస్‌యూఐ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి శనివారం యత్నించారు. గ్రేస్ మార్కులు సాధించిన విద్యార్థులకే కాకుండా మొత్తం పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్‌యూఐ నేతల మెరుపు ధర్నాతో అలర్ట్ అయిన బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.Next Story

Most Viewed