నోట్ బుక్స్‌లో ‘ముందు మాట’ వివాదం.. డైరెక్టర్‌పై వేటు

by Rajesh |
నోట్ బుక్స్‌లో ‘ముందు మాట’ వివాదం.. డైరెక్టర్‌పై వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: పాఠ్యపుస్తకాల్లో ముందుమాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడం తెలంగాణ పాలిటిక్స్‌లో అగ్గి రాజేసింది. మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల పేర్లను ఉంచడంతో వివాదం మొదలైంది. ఇక, తాజాగా తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తక ముద్రణ సేవల డైరెక్టర్ శ్రీనివాసాచారిపై చర్యలు తీసుకుంది. ఎస్‌సీఈఆర్‌టీ అదనపు డైరెక్టర్ రాధారెడ్డిపై సైతం యాక్షన్స్ తీసుకుంది. పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసాచారి, రాధారెడ్డిలను తొలగించింది. ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్‌కు బాధ్యతలు అప్పగించింది. టీఆర్ఈఐఎస్ కార్యదర్శి రమణకుమార్‌కి ముద్రణ సేవల డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది.Next Story

Most Viewed