Dharmapuri Arvind : రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయే.. కాంగ్రెస్ ఎక్కడుంది : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 1 |
Dharmapuri Arvind : రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయే.. కాంగ్రెస్ ఎక్కడుంది : ధర్మపురి అరవింద్
X

కాంగ్రెస్ లో చేరికల ప్రచారం కేవలం మీడియా సృష్టే

ఇప్పుడు కాంగ్రెస్ లో చేరే వారు త్వరలోనే బీజేపీలోకి రావడం పక్కా

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బీజేపీని కాదని కాంగ్రెస్ లో చెరడం పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ లో బీజేపీ నేత పైడి రాకేష్ రెడ్డి నివాసంలో 'మేరా బూత్ సబ్ సే మజ్ బూత్' కార్యక్రమంలో భాగంగా పీఎం నరేంద్ర మోదీ ప్రసంగాన్ని స్థానిక నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి ఎంపీ అరవింద్ వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో భారీ చేరికలంటూ జరుగుతున్న ప్రచారం కేవలం మీడియా సృష్టేనని కొట్టి పాడేశారు. సీఎం కేసీఆర్ పనిగట్టుకుని కాంగ్రెస్ కు హైప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరే వారంతా త్వరలో బీజేపీలోకి రావడం పక్కా అని జోస్యం చేప్పారు. తొందరపడి ఎవరు కాంగ్రెస్ లోకి వెళ్లొద్దని, పొంగులేటి చేరికతో కాంగ్రెస్ కు ఏమాత్రం ప్రయోజనం ఉండన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారికి షరతులు పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని, కాంగ్రెస్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేటీఆర్ తో సమావేశం అయ్యారని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానేయాలని హితవు పలికారు. పోరాటం చేసేందుకు వెనకాడే వారే ఇలాంటి మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఆ విషయాన్ని తేల్చేస్తారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నామంటూ అసదుద్దీన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎవరు ఎన్ని చెప్పినా.. కారు స్టీరింగ్ మాత్రం నేటికీ ఎంఐఎం చేతిలోనే ఉందంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో బీజేపీ గెలుస్తామో.. తమ స్టాటజీ తమకు ఉందన్నారు. రాజ్యాంగంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారని అన్నారు. తప్పు చేస్తే వారు ఎంతటి వారైనా.. శిక్ష తప్పదంటూ ఢిల్లీ లిక్కర్ కేసును ఉద్దేశించి కీలక వాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలకు ఓట్లే్స్తే.. వాళ్ల ఆస్తులు తప్పా, ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రజలంతా న్యాయంగా బీజేపీకి ఓటేసి భారతదేశ సమైక్యతను చాటాలన పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed