రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు తప్పు : స్పీకర్ పోచారం

by Disha Web Desk 20 |
రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు తప్పు : స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తో కేటీఆర్ కి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం భాన్సువాడలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిని ఓ చిన్న కారణం చూపి అనర్హత వేటు వేశారన్నారు. శిక్ష అమలయ్యేకంటే ముందే అనర్హత వేటు ప్రకటించారన్నారు. ఇది ప్రజాస్వామ్యం ఖూనీ అయిన చర్య అని అన్నారు. నిన్నటిరోజు చీకటిరోజు అని, తక్షణమే రాహుల్ పై వేటు ఎత్తేయాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో నిందితులను పట్టుకున్నారని, దోషులు ఎవరైనా శిక్షిస్తామని ప్రభుత్వం తెలిపిందని అన్నారు. అయినా కొందరు దురుద్ధేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 11 వేల మంది కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి దాన్ని ఇప్పటికే అమలు చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని దుర్భుద్ధితో కొందరు చేసిన పనే ఈ లీకేజీ వ్యవహారమని, విచారణలో ఎవరెవరున్నారనేవి బయటపడతాయన్నారు. కొందరు నాయకులు ఆధారాల్లేకుండా మైకుల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కేటీఆర్ కు ప్రశ్నాపత్రాల లీక్ తో సంబంధం లేదన్నారు.

Next Story

Most Viewed