కొన్ని రాజకీయ పార్టీలు నినాదాలు మాత్రమే చెప్పాయి.. ప్రజలకు నిజాలు చెప్పవు : MLC Kavitha

by Disha Web Desk 1 |
కొన్ని రాజకీయ పార్టీలు నినాదాలు మాత్రమే చెప్పాయి.. ప్రజలకు నిజాలు చెప్పవు : MLC Kavitha
X

కొన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల్లో అబద్దాలను ప్రచారం చేస్తున్నారు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కొన్ని రాజకీయ పార్టీలు నినాదాలు మాత్రమే చెప్పాయని.. ప్రజలకు నిజాలు చెప్పవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాషాయ కండువా కప్పుకున్న వాళ్లు జై జవాన్.. జై కిసాన్ అని మొత్తుకుంటున్నారని.. డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లు ఒర్రుడే తప్పా.. కిసాన్లకు, జవాన్లకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అదే సీఎం కేసీఆర్ అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకున్నారని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దదని.. కేసీఆర్ ది పెద్ద మనసని అన్నారు. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుందన్నారు. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పని చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంపై ఆలోచన చేయాలని ఆత్మీయ సమ్మెళనంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మన నాయకుడు కేసీఆర్ బాటలో నడుద్దామని.. స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా అద్భుతంగా పని చేస్తున్నారని కవిత ప్రశంసించారు.

ఆయన చేస్తున్న మంచి పనులను చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ఓ వ్యక్త బీఆర్ఎస్ పార్టీలో చేరితే.. అంత.. ఇంత ఇచ్చి చేర్చుకున్నారంటూ బీజేపీ దుష్ర్పాచారం చేసిందన్నారు. చాలా పార్టీలు సామాజిక మాధ్యమాల్లో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాలు ఒక అబద్ధం చెబితే మనం 100 నిజాలు చెప్పి గట్టిగా కౌంటర్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్ధకు తీసుకువేళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఉండండి.. ప్రజలను జాగృతం చేయండని సూచించారు. రాబోయే ఎన్నికల్లో కూడా మూడోసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, చైర్మన్ ఆకుల లలిత, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ ఫిడ్కో చైర్మన్ ఎస్.ఏ అలీం, నాయకులు సూదం రవి చందర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, సిర్పరాజు, కార్పొరేటర్లు ఉమారాణి, పంచారెడ్డి నర్సుభాయ్, మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తం, కార్పొరేటర్ మల్లేష్ యాదవ్, కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాజు, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed