రెండు వరద గేట్ల ద్వారా నిజాంసాగర్‌ నీటి విడుదల

by Disha Web Desk 15 |
రెండు వరద గేట్ల ద్వారా నిజాంసాగర్‌ నీటి విడుదల
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి వరదనీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని మాంజీరాలోకి వదిలిపెడుతున్నట్లు నీటిపారుదలశాఖ ఏఈ శివ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 8000ల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేసి 8000ల క్యూసెక్కులు మాంజీరాలోకి వదులు తున్నట్లు వెల్లడించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు అనగా 17.802 టీఎంసీలు కాగా పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువప్రాంతం నుండి వస్తున్న వరదనీటినంతటినీ మాంజీరాలోకి వదులుతున్నట్లు పేర్కొన్నారు.



Next Story

Most Viewed