ఆర్మూర్‌లో నిజాంసాగర్ కాలువ స్థలం దర్జాగా కబ్జా.. పట్టించుకోని అధికారులు

by Dishanational2 |
ఆర్మూర్‌లో నిజాంసాగర్ కాలువ స్థలం దర్జాగా కబ్జా.. పట్టించుకోని అధికారులు
X

దిశ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ లో కోటార్ మూర్ రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి 63వ నంబర్ ప్రక్కన నిజాంసాగర్ కాలువ నంబర్ 82-2-1-2 స్థలాన్ని ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా కబ్జా చేస్తున్నాడు. కోటార్ మూర్లోని కరీంనగర్ జాతీయ రహదారి రోడ్డులో రియాల్టర్ నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమకేం పట్టనట్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆర్మూర్ లో ప్రజలు చర్చించు కుంటున్నారు .

గతంలో ఆర్మూర్ మండలంలో పెర్కిట్ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో కోటార్మూరు గ్రామానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, ప్రకాష్ రెడ్డి, బి శంకర్, వేల్పూర్ గంగారెడ్డి ల భూములు, వారి కుటుంబ సభ్యుల భూములను ఓరియల్టర్ కొనుగోలు చేశారు. పెరికిట్ కొటార్ మూర్ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలోనే ఆ రియాల్టర్ ఆ భూముల్లోంచి రెండు వెంచర్లను ఏర్పాటు చేశారు. ఆ వెంచర్లలో నిజాంసాగర్ కాలువ నంబర్ 82-2-1-2 గల స్థలాన్ని ఆక్రమించుకునీ కబ్జా చేసుకుని దర్జాగా అప్పట్లో అధికారులకు పాలకవర్గ సభ్యులకు ఆమ్యాన్యాలను ఆశగా చూపి వెంచర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అప్పట్లో వెంచర్లకు తోడు మిగిలిన భూములకు చుట్టూరా నిజాంసాగర్ కెనాల్ కాలువ స్థలాన్ని కలుపుకుంటూ అక్రమ పద్ధతిలో ప్రహరీ గోడలను సదరు రియాల్టర్ నిర్మాణం చేస్తున్న ఒక్క అధికారి సైతం అదేమిటి అన్న పాపాన పోలేదని ఆర్మూర్ ప్రజలు విస్తుబోతున్నారు. ఈ నిజం సాగర్ కెనాల్ సుమారు 24 మీటర్ల నుండి 20 మీటర్ల వెడల్పు అంటే 66 ఫీట్ల వెడల్పును కలిగి ఉంటుంది.ఉంటుంది. కోటార్ మూరు లో 22-2, 22-3, 40-2 సర్వే నంబర్ల మధ్యలో నిజాంసాగర్ కాలువ 82-2-1-2 నంబర్ గలది రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉంది. ఈ సర్వే నంబర్ల గుండా నిజాంసాగర్ కెనాల్ స్థలాన్ని రియల్టర్లు దర్జాగా తమ వెంచర్లలో గ్రామపంచాయతీ సమయంలోనే కలుపుకున్నారు. మిగిలిన వారి స్థలాల్లో ప్రస్తుతం సైతం ఆ నిజం సాగర్ కాలువ స్థలాన్ని దర్జాగా కలుపుకుంటూ వారి స్థలాలకు అక్రమ పద్ధతిలో కెనాల్ స్థలాన్ని కలిపి ప్రహరీ గోడలను నిర్మాణం చేస్తున్నారు.

ఈ సర్వే నంబర్ల గుండా 24 మీటర్ల నుండి 20 మీటర్ల వెడల్పు గల నిజాంసాగర్ కెనాల్ స్థలం సుమారు 2000 నుంచి 2500 మీటర్ల పొడవు కలిగిన స్థలాన్ని కలుపుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో 63 నంబర్ జాతీయ రహదారి ప్రక్కన సుమారు 50 వేల నుంచి 80 వేల వరకు గజం చొప్పున ప్లాట్లను అమ్మకాలు జరుపుతున్నారు. ఇంత విలువైన ఏరియాలో గల 24 మీటర్ల వెడల్పు తో గల సుమారు 2500 ఫీట్ల పొడవు గల నిజాంసాగర్ కాలువ ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా రియల్టర్లు కబ్జా చేసి అమ్మకాలు జరపడంతో పాటు, వారి మిగులు భూముల్లో నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని కలుపుకుంటున్నారు. కోటార్ మూర్ రెవెన్యూ పరిధిలో గల నిజాంసాగర్ కెనాల్ వెంబడి గల సర్వే నంబర్ల వారిగా భూముల వివరాలను, నిజాంసాగర్ స్థల వివరాలను అధికారులు లెక్కలు తీయించి విలువైన ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని ఆర్మూర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపల్, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి విలువైన నిజాంసాగర్ ప్రభుత్వ కెనాల్ స్థానాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story

Most Viewed